Araku Utsav: అట్టహాసంగా అరకు ఉత్సవ్ ప్రారంభం
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నిర్వహిస్తున్న పర్యాటక ఉత్సవాలను రానున్న రోజుల్లో ఆసియాలోనే అతిపెద్ద పండుగగా తీర్చిదిద్దుతాం అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్(Kandula Durgesh) పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో అరకు ఉత్సవ్ (Araku Utsav)-2026 ను గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhyarani)లో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ తూర్పుతీరాన్ని పర్యాటక గమ్యంగా అభివద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగానే అరకు (Araku), అనకాపల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. లంబసింగిలో రూ.6.5 కోట్లతో రాష్ట్రలోనే తొలిసారి టెంట్ సిటీ, రూ.5 కోట్లతో కారవాన్ పార్కులు, రూ.1.23 కోట్లతో హోంస్టేలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.గతంలో పర్యాటకముంటే విలాసవంతమైన హోటళ్లు, రెస్టారెంట్లకు పరిమితమైంది. కూటమి ప్రభుత్వం పర్యాటకానికి పారిశ్రామిక హోదాను కల్పించింది. ఆంధ్రుడి ఆతిథ్యం ఇప్పుడు ప్రపంచ పర్యాటకులకు సరికొత్త చిరునామాగా మారుతోంది అని పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






