High Court: రాజ్ కెసిరెడ్డి కి హైకోర్టు లో ఎదురుదెబ్బ
వైసీపీ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి (Raj KC Reddy) (ఏ1)కి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి సహ నిందితులతో కుట్రపని మద్యం కుంభకోణానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు (High Court) తీర్పులో స్పష్టం చేసింది. రాజ్ కెసిరెడ్డి అప్పటి ముఖ్యమంత్రికి ఐటీ సలహాదారుగా ఉన్నారనేది వాస్తమని తెలిపింది. తర నిందితులతో కెసిరెడ్డి తన కార్యాలయంలో పలుమార్లు సమావేశమయ్యారని పేర్కొంది. కెసిరెడ్డి, ఆయన సిండికేట్ సభ్యులకు లంచాలిచ్చిన డిస్టిలరీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించినట్లు సాక్షులు, డిస్టలరీల ఉద్యోగులు వాంగ్మూలాలో చెప్పారని గుర్తు చేసింది. నూతన మద్య విధానం అమల్లోకి తీసుకొచ్చాక బినామీ సంస్థ అదాన్ డిస్టిలరీని గుప్పిట్లో పెట్టుకుని ముప్పిడి అవినాష్ రెడ్డి (Avinash Reddy) (ఏ7) ద్వారా రాజ్ కెసిరెడ్డి వ్యవహారం నడిపించినట్లు సాక్ష్యాధారాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి (Justice Venkata Jyothirmayi) ఈ మేరకు తీర్పు చెప్పారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






