Nara Lokesh : దీనిని విడదీయడం ఎవరి తరం కాదు : మంత్రి లోకేశ్
తిరుమల (Tirumala) ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైసీపీ ప్రభుత్వం వ్వవహరించిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. టౌన్, వార్డు, మండల స్థాయి టీడీపీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యర్తలను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడారు. చేయకూడని పాపాలు చేసి, తప్పుడు ప్రచారాలతో ప్రజలను వైసీపీ (YCP) మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టే బాధ్యత టీడీపీ కార్యకర్తలదే. కూటమిని చీల్చే కుట్ర జరుగుతోంది. దీనిని విడదీయడం ఎవరి తరం కాదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఐక్యంగా దుష్ప్రచారాలను అడ్డుకోవాలి. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి. కూటమి నాయకుల మధ్య సఖ్యత అత్యంత ముఖ్యం అని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






