Minister Subhash: సిట్ పూర్తిస్థాయి నివేదిక వస్తే.. ఆ పార్టీ నేతలకు గుండెపోటులు
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ చేస్తోన్న తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subhash) మండిపడ్డాడరు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షి ఛానల్ (Sakshi Channel) ఇచ్చిన క్లీన్‌చీట్‌ను సిట్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరమన్నారు. సిట్ (SIT) పూర్తిస్థాయి నివేదిక వస్తే, ఆ పార్టీ నేతలకు గుండెపోటులు వస్తాయన్నారు. మహా పాపాన్ని కప్పిపుచ్చుకునేం దుకు వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. తిరుమలపై జగన్, ఆయన బ్యాచ్ ఎందుకు కక్ష కట్టిందో చెప్పాలి. వైఎస్ కూడా ఐదు కొండలంటూ గతంలో భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆలయానికి వెళ్లటం, ప్రసాదాన్ని తక్కువ చేసి మాట్లాడటం, గుడికి వెళ్లకుండా సెట్టింగ్‌లు వేసుకోవటం అలవాటుగా పెట్టుకున్నారు. కరుణాకర్‌రెడ్డి మనుషులు ఖాళీ మద్యం బాటిళ్లు పెట్టి దొరికిపోయారు. కల్తీ జరిగిందని సిట్ నివేదికలో నిర్ధరణ అయినా సంబరాలా? ఇకనైనా దేవుడితో ఆటలాపితే వాళ్లకే మంచిది అని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






