Traffic Rules: వాహనదారులకు భారీ షాక్.. 5 చలాన్లు దాటితే…
కేంద్ర రవాణా శాఖ ‘సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్’లో చేసిన తాజా సవరణలు జనవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చాయి. ఇకపై చలాన్లను నిర్లక్ష్యం చేస్తే కేవలం జరిమానాతోనే కాకుండా, మీ లైసెన్స్ రద్దు, వాహన జప్తు వంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
లైసెన్స్ రద్దు
కొత్త నిబంధనల ప్రకారం, ఒక ఏడాది కాలంలో ఒక వాహనంపై 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైతే, సంబంధిత డ్రైవర్ లైసెన్స్‌ను అధికారులు సస్పెండ్ చేయవచ్చు లేదా శాశ్వతంగా రద్దు చేయవచ్చు. గతంలో కేవలం తీవ్రమైన నేరాలకు మాత్రమే ఈ నిబంధన ఉండేది, కానీ ఇప్పుడు సాధారణ ఉల్లంఘనలకు కూడా ఇది వర్తిస్తుంది.
45 రోజుల గడువు.. లేదంటే బండి సీజ్!
చలాన్ చెల్లింపు గడువును 90 రోజుల నుండి 45 రోజులకు తగ్గించారు. ఈ గడువులోపు జరిమానా చెల్లించకపోతే:
- ఆ వాహనంపై ఎటువంటి ఆర్టీఓ (RTO) లావాదేవీలు (అమ్మకం, పేరు మార్పిడి, ఇన్సూరెన్స్ రెన్యువల్) జరగవు.
- ట్రాఫిక్ పోలీసులు అటువంటి వాహనాలను ఎక్కడికక్కడ స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉంటారు.
టోల్ బకాయిలు ఉంటే..
ఫిబ్రవరి 1, 2026 నుండి అమల్లోకి రానున్న కొత్త టోల్ నిబంధనల ప్రకారం, నేషనల్ హైవేలపై పెండింగ్‌లో ఉన్న టోల్ ఫీజులను (Unpaid User Fee) చెల్లించకపోతే ఆ వాహనానికి NOC (No Objection Certificate) జారీ చేయరు. అంటే, టోల్ బకాయిలు ఉంటే మీ వాహనాన్ని వేరే వ్యక్తికి బదిలీ చేయడం లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందడం కుదరదు.
FASTag, డిజిటల్ మానిటరింగ్
FASTag నిబంధనల్లో కూడా మార్పులు వచ్చాయి. ఇకపై కొత్త ట్యాగ్ తీసుకునేటప్పుడు KYV (Know Your Vehicle) ప్రక్రియను మరింత సరళతరం చేస్తూనే, బ్యాంకులు వాహన డేటాబేస్ ద్వారా వివరాలను ముందే ధృవీకరించాలి. అలాగే, ప్రతి చలాన్ జారీ అయిన 3 రోజుల్లోపు ఎలక్ట్రానిక్ నోటీసు పంపడం తప్పనిసరి చేశారు.
జరిమానాల టేబుల్…
- డ్రింక్ అండ్ డ్రైవ్: మొదటిసారి రూ. 10,000, 6 నెలల జైలు, రెండోసారి రూ. 15,000, 2 ఏళ్ల జైలు.
- మొబైల్ డ్రైవింగ్: రూ. 5,000 వరకు.
- అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే: రూ. 10,000.
- మైనర్ డ్రైవింగ్: రూ. 25,000 ఫైన్ (తల్లిదండ్రులకు శిక్ష).






