Varanasi: వారణాసి కోసం జక్కన్న మాస్టర్ ప్లాన్
దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) హీరోగా తెరకెక్కుతున్న సినిమా వారణాసి(varanasi). ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో తీస్తున్నాడు. రాజమౌళి ముందు నుంచి కూడా తన సినిమా కోసం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు వారణాసి సినిమాకు కూడా జక్కన్న అదే ఫాలో అవుతున్నాడు. సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో వారణాసికి రాజమౌళి ఎంతటి క్రేజ్ ను తీసుకొచ్చాడనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమా షూటింగ్ ను గతంలో ఏ ఇండియన్ సినిమా తెరకెక్కించని ప్రదేశాల్లో తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. అది మరెక్కడో కాదు అంటార్కిటికాలో.
ఇప్పటివరకు అంటార్కిటికాలో ఏ ఇండియన్ సినిమా షూటింగ్ జరుపుకోలేదు. రాజమౌళి మొదటి సారిగా అంటార్కిటికాలో వారణాసి షూటింగ్ చేయబోతున్నాడని, త్వరలోనే చిత్ర యూనిట్ లొకేషన్స్ ను వెతకడానికి వెళ్లనుందని, సినిమాలోని కొన్ని కీలక భాగాలను అంటార్కిటికాలోని ఎవరూ చూడని ప్రదేశాల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా(priyanka chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి.






