Rajini-Kamal: కోలీవుడ్ భారీ మల్టీస్టారర్ కు డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా?
సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth), లోక నాయకుడు కమల్ హాసన్(kamal hassan).. గత కొన్ని దశాబ్దాలుగా కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. కెరీర్ మొదట్లో కలిసి సినిమాలు చేసిన వీరిద్దరూ. స్టార్లుగా మారాక ఒక్క సినిమా కూడా చేసింది లేదు. దీంతో వీరిద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తే చూడాలని ఎంతో మంది మూవీ లవర్స్ కోరుతున్నారు.
అందులో భాగంగానే వీరితో సినిమా రానుందని వార్తలు కూడా వచ్చాయి. మధ్యలో అట్లీ(ATLEE), ప్రదీప్ రంగనాథన్(Pradeep ranganathan), లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) లాంటి డైరెక్టర్లు వీరిద్దరికీ కథలు కూడా చెప్పారు. కానీ ఏ ప్రాజెక్టూ ఓకే అవలేదు. కూలీ(coolie) సినిమా బాగా పెర్ఫార్మ్ చేసి ఉంటే లోకేష్ తో ఈ ప్రాజెక్టు ముందుకెళ్లేది కానీ ఆ సినిమా అనుకున్నవిధంగా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో లోకేష్ ప్రాజెక్టు ఆగిపోయింది
అయితే ఇప్పుడా ప్రాజెక్టు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson dileep kumar) వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రజీనకాంత్ తో జైలర్2(Jailer2) చేస్తున్న నెల్సన్ ఈ మల్టీస్టారర్ కు దర్శకత్వం వహించే అవకాశముందని, వచ్చే వారంలో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ప్రోమోను కూడా షూట్ చేయనున్నారని తెలుస్తోంది. కాకపోతే జైలర్2 ఫలితాన్ని బట్టి ఈ మల్టీస్టారర్ ఉంటుందా లేదా అనేది తెలుస్తుందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.






