Revanth Reddy: హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University)లోని కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో లీడర్షిప్ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు లీడర్షిప్ ఫర్ ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరయ్యారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థుల (Students)తో కలిసి తరగతులకు హాజరైనట్లు టీచర్స్ (Teachers), తోటీ విద్యార్థుల నుంచి ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






