TG Bharat:అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై చర్చిస్తాం : టీజీ భరత్
కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలు తప్పు చేసి, ఇప్పుడోమో అడ్డంగా వాదిస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ (TG Bharat) విమర్శించారు. కర్నూలు నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెన్షన్లు ఎంతో పారదర్శకంగా, ఒక రోజు ముందే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం మాత్రమే తిరుమల (Tirumala) పవిత్రతను కాపాడుతోంది. తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ ఎక్కడా చెప్పలేదు. తప్పు చేసి మరీ, సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా దేవుడి ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో ఈ విషయంపై చర్చిస్తాం. దావోస్ (Davos) పర్యటలో రాష్ట్రాన్ని అత్యుత్తమంగా ప్రమోట్ చేశాం. దీని ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయి అని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






