GV Anjaneyulu: రాష్ట్రాన్ని లూటీ చేయడమే ఆయన ప్రధాన అజెండా : చీఫ్ విప్ జీవీ
వైసీపీ అధినేత జగన్కు దేశభక్తితో పాటు దైవ భక్తి కూడా లేదని ప్రభుత్వ చీఫ్విఫ్ జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) విమర్శించారు. పల్నాడు జిల్లా (Palnadu District) వినుకొండ పట్టణంలోని 24వ వార్డులో పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని లూటీ చేయడమే ప్రధాన అజెండాగా జగన్ (Jagan) పాలన సాగిందన్నారు. ఐదేళ్లలో తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా దోపిడీ చేశారని ఆరోపించారు. తిరుమల లడ్డూ (Tirumala Laddu) కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు ఇప్పటికైనా దుష్ప్రాచారాలను మానుకోవాలని హితవుపలికారు. రాష్ట్ర ప్రజలు, తిరుపతి వెంకన్నకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.2,510 కోట్ల నెయ్యి కల్తీ జరిగినట్లు స్పష్టమైందన్నారు. పాలు లేకుండా నెయ్యి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నెయ్యి కల్తీ చేయకపోతే వైవీ సుబ్బారెడ్డి ఖాతాల్లోకి రూ.కోట్ల నగదు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాజకీయం చేయడం సరికాదన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






