Minister Gottipati: తిరుమల గౌరవాన్ని ఆ పార్టీ భ్రష్టుపట్టించింది : మంత్రి గొట్టిపాటి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్(NTR) విగ్రహాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ( Gottipati Ravikumar)ఆవిష్కరించారు. అనంతరం రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. సంక్షేమంలో ఎన్టీఆర్ స్ఫూర్తిని నేడు చంద్రబాబు(Chandrababu) , లోకేశ్ (Lokesh) కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చుతోంది. జగన్ అవినీతి మూలాల్లోంచి పుట్టిన పార్టీ వైసీపీ. ఆ పార్టీ నేతలు అస్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తిరుపతి, తిరుమలకు ఉన్న గౌరవాన్ని ఆ పార్టీ భ్రష్టుపట్టించింది. తిరుమల కల్తీ నెయ్యి విషయంలో ఆ పార్టీ అసత్య ప్రచారం చేస్తోంది అని ఆరోపించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






