KCR: న్యాయవాదులతో కేసీఆర్ సమాలోచనలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలు, న్యాయవాదుల (Lawyers)తో ఎర్రవల్లిలో సమాలోచనలు చేశారు. కేటీఆర్ (KTR), హరీశ్‌రావు ( Harish Rao) నిన్నటి నుంచి ఎర్రవల్లిలోనే ఉన్నారు. రేపటి సిట్ విచారణ అంశంపై చర్చిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో తాము ఉంటున్న ఇంటికే వచ్చి విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అక్కడకు రాలేమని చెబుతూ హైదరాబాద్‌లోనే విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని పేర్కొంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






