శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడపటాన్ని ఎగుర వేశారు. సాయంత్రం 5:45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో అంకురార్పణ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.