ఫిబ్రవరి 2 నుంచి సమతా కుంభ్
ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్-2023, శ్రీరామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ఆధ్మాత్మిక గురువు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత చినజీయర్‌స్వామి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలను ఏటా కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి ప్రాణికి దేవుడు ఆధారమని, దాన్ని చెప్పే ముఖ్య ఉద్దేశమే బ్రహ్మోత్సవాల ప్రధాన లక్ష్యమని స్వామిజీ తెలిపారు.













