దోరాస్ ఆర్ట్స్ భక్తి స్వరాలతో మురిసిన అన్నమయ్యపురం
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం దోరాస్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గురువు శ్రీమతి శిరీష పాముల గారి మార్గదర్శకత్వంలో భక్తిశ్రద్ధలతో అన్నమ స్వరార్చన కార్యక్రమం నిర్వహించారు.
దోరాస్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన తనుశ్రీ, ఉమాదేవ్, మధురిమ, శ్రీలేఖ వి., సంయుక్త, విశ్రుత్ యు., విభా రెడ్డి బీరవెల్లి, అన్వయ అవినాష్, తరుణి, ధృవ, దేవశ్రీ, పరమేశ్వరి, అన్షిక, వి. ఉష, గుండు గాయత్రి మనోగ్ఞ, గుండు భావజ్ఞ, వైష్ణవి గట్పా, శ్రీలలిత దుర్గ, ఆర్. చంద్రకళ, ఎం. త్రయతి సహస్ర, కీర్తిక తన్వి ఎం., ఆయుష్, గీతాంశ్, చార్వి శ్రీ ప్రజ్ఞ ఓజిలి, మాహిరా తేజోమూర్తుల, మణికొండ దక్ష జె., ఆర్యన్ వి. రావు, రోహిత పి. తదితరులు శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి భక్తిపూర్వకంగా “తలచరో జనులు, తందనానా అహి, నారాయణతే నమో నమో, అన్ని మంత్రములు, శరణు శరణు నీకు, ఆలోకయే శ్రీ బాలకృష్ణం, మనసా సంచరరే, తిరు తిరు జవరాల, సిరుత నవ్వుల వాడు, భావములోన, గోవింద గోవింద, వేదంబెవ్వని, వినరో భాగ్యము, అంబాష్టకం” వంటి భక్తిరసభరితమైన కీర్తనలను శ్రుతి–లయ సమన్వయంతో ఆలపించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.
శిష్యుల సమిష్టి గానం అన్నమయ్య సాహిత్యంలోని భక్తి, తాత్వికత, మాధుర్యాన్ని ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మికానందాన్ని పంచింది. ఈ స్వరార్చనకు శ్రీ జయకుమార్ ఆచార్య గారు మృదంగంపై, శ్రీ రామినాయుడు గారు వయోలిన్పై వాయిద్య సహకారం అందించి కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని పక్షాన దోరాస్ ఆర్టిస్టులు శ్రీ దిలీప్ గారు, శ్రీమతి కిరణ్మయి గారు పాల్గొని కళాకారులను అభినందించారు.
అన్నమయ్య సంకీర్తనలను భావపూర్వకంగా ఆలపిస్తూ, భక్తి సంగీత పరంపరను కొనసాగిస్తున్న దోరాస్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ గురువు శ్రీమతి శిరీష పాముల గారి కృషిని ఈ సందర్భంగా అభినందించారు.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు పాల్గొన్న గురువులు, కళాకారులను శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి సత్కరించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో ఈ శనివారం అన్నమయ్యపురంలో జరిగిన సత్సంగం భక్తి, సంగీత మాధుర్యాలతో విజయవంతంగా ముగిసింది.








