తిరుమల వెంకటేశ్వరునికి విరాళం – తెలుపుతుంది ఒక జీవిత సత్యం
ఎంత పోగుచేసి పోయినా, “ఇంతేనా?” అని పెదవి విరిచే నీ వాళ్ళను చూసి…
ఎందుకీ మురిపెం? ఎందుకీ అహంకారం?
ఆ సర్వేశ్వరుని పాదాల చెంత నువ్వు ఉంచే కానుక నీది కాదు ఓ మనిషీ…
ఆయన నీకు ప్రసాదించిన సంపదలోంచి, ఆయనకే తిరిగి సమర్పించుకునే ఓ చిన్ని కృతజ్ఞత మాత్రమే కదా!
సిరిసంపదలు మూలుగుతున్నా, సాయం చేయడానికి చేతులు రాని కఠినాత్ములకు…
ఈరోజు ఆ తిరుమల గిరివాసుని సన్నిధిలో కురిసిన కానుకల వర్షం ఓ కనువిప్పు కావాలి.
దానం చేయని ధనం, కరగని హృదయం… రెండూ వ్యర్థమేనని ఆ ఏడుకొండలవాడు మౌనంగానే చాటి చెబుతున్నాడు.
“నాకుంది… నాకుంది…” అని విర్రవీగే ప్రతి ఒక్కరూ,
ఒక్క క్షణం ఆగి, “అసలు నాకు ఏముంది?” అని గుండెపై చేయి వేసుకుని ఆలోచిస్తే…
జీవితపు అసలు సత్యం కళ్ళముందు కదలాడుతుంది.
చేతిలో నిలిచే డబ్బు ఉందా?
మనసును నింపే ఆనందం ఉందా?
తనువుకు తోడుండే ఆరోగ్యం ఉందా?
నలుగురికీ పంచగలిగే నిజమైన ఐశ్వర్యం ఉందా?
ఇవి అన్నీ ఉండి, ఆ భగవంతుని స్మరణలో, దానగుణంలో తరించినప్పుడే కదా…
ఈ మనిషి జన్మకు నిజమైన అర్థం… పరమార్థం!
– DG సుకుమార్







