రాఫెల్ విజేతల పేర్లను ప్రకటించిన Telugu Association of Central Ohio
సెంట్రల్ ఓహియోలోని ప్రముఖ తెలుగు సంస్థ ట్యాకో (Telugu Association of Central Ohio – TACO) నిర్వహించిన దీపావళి వేడుకల్లో భాగంగా 2027 సభ్యత్వ రాఫెల్ విజేతల పేర్లను ప్రకటించింది. వేడుక సందర్భంగా 2027 సభ్యత్వానికి నమోదు చేసుకున్న సభ్యుల నుంచి లక్కీ డ్రా ద్వారా 11 మందిని విజేతలుగా ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ రాఫెల్లో విజేతలకు వివిధ దాతలు, సంస్థలు ఆకర్షణీయమైన బహుమతులను అందించారు. రామకృష్ణ కామతం కోఆర్డ్ డ్రెస్ సెట్ (సరిమా బొటిక్), శ్వేత సింగ్ వంట నూనె (వీ ప్యూరిటీ), శ్రీకాంత్ మడుపోసు డ్రెస్ సెట్ (త్రిశోభ), వంశీ తల్లూరి గిఫ్ట్ హాంపర్ (యంగ్ ఇంజనీర్స్), సతీష్ కుమార్ గారె ఇయర్రింగ్స్ (దిగిరా కలెక్షన్స్) గెలుచుకున్నారు. అలాగే హరి పాతూరి పట్టు చీర (ఎస్ఆర్బీ సిల్క్స్), మోహన మురళి గాలి డిజైనర్ చీర (ఆర్తిషా డిజైనర్స్), ప్రశాంత్ కనితి అందమైన వేంకటేశ్వర విగ్రహం (యిప్పీ మేకర్), నౌషద్ పాషా అందమైన కృష్ణుడి విగ్రహం (యిప్పీ మేకర్), సుధీర్ కుమార్ కొనంకి అందమైన డ్రెస్ (శాంతిస్ ఫ్యాషన్), నేహా పాండిచ్చేరి ఫ్యాషన్ ఇయర్రింగ్స్ (గెహ్నా జ్యువెలరీ) బహుమతులుగా అందుకున్నారు.విజేతలందరికీ ట్యాకో తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమ విజయానికి సహకరించిన స్పాన్సర్లు మరియు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది.







