ఆ సత్తా భారత్కు ఉంది : యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని నరేంద్ర మోదీ పాలనా దక్షతను ప్రశంసించారు. భారతదేశం పట్ల ప్రపంచం ఆసక్తిగా చూసే విధంగా మోదీ పరిపాలిస్తున్నట్లు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసే సత్తా భారతదేశానికి ఉందని ప్రపంచం భావించే స్థాయికి భారత దేశాన్ని మోడీ అభివృద్ధి చేశారన్నారు. దేశం కోసం మోదీ చేస్తున్న కృషిని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు అర్థం చేసుకోవడం లేదని యోగి అన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వల్ల భారతదేశంలో వచ్చిన మార్పులను అందరూ గమనిస్తున్నారన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య భారతదేశం మధ్యవర్తిత్వం వహించగలదనే అభిప్రాయం నెలకొందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఇది నవ భారతమని, అభివృద్ధి చెందుతున్న భారతదేశమని చెప్పారు.













