6 నుంచి యోగా పాఠ్యాంశాలు
దేశంలోని పాఠశాలల్లో 6వ తరగతి నుంచి విద్యార్థులకు యోగా పాఠాలు ప్రవేశపెట్టాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా,పరిశోధన మండలి (ఎన్సీఆర్టీ) నిర్ణయించింది. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు అన్ని రాష్ట్రాల్లోని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా పాఠాలు చెప్పాలని కేంద్రం నిర్ణయించింది. యోగా ద్వార పిల్లల ఆరోగ్యం మెరుగుపర్చేందుకు యోగా పాఠాలు ప్రవేశ పెడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. యోగాపై థీయరీతోపాటు వివిధ రకాల ఆసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ నేర్పించాలని కేంద్రం నిర్ణయించింది













