ఈ కేక్ ఖరీదు రూ.16 లక్షలు
దుబాయిలోని ఓ బేకరీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదయిన కేక్‌ను తయారు చేసింది. దీని తయారీకి ఏకంగా 25వేల డాలర్లు (రూ.16లక్షలకుపైగా) ఖర్చయినట్లు ఓ మీడియా కథనం పేర్కొంది. నాలుగడుగుల ఎత్తుండే ఈ కేక్‌ను పూర్తిగా చక్కెర పాకం, చక్కెర పేస్ట్‌తో తయారు చేశారు. 32 కిలోల బరువుండే దీన్ని వందనుంచి 120 మందికి వడ్డించవచ్చని ఈకేక్ను తయారు చేసిన బ్రాడ్వే బేకరీ తెలిపింది. హాలీవుడ్ చిత్రం గేమ్ ఆఫ్ త్రోన్స్తో క్యారెక్టర్ టిరియన్ లానిస్టర్కు నివాళిగా దుబాయిలో ఈ స్పాంజ్ కేక్‌ను తయారు చేసినట్లు గల్ఫ్‌న్యూస్ పత్రిక తెలిపింది.













