నవంబరు 3 నుంచి వరల్డ్ పుడ్ ఇండియ సదస్సు
ఆహార రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవసరాలు, సాంకేతిక పరిజ్ఞానాల్ని దేశీయంగా పరిచయం చేసి కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే లక్ష్యంతో దేశ రాజధానిలో వరల్డ్ పుడ్ ఇండియ సదస్సును నిర్వహిస్తున్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో మూడు రోజులు జరిగే ఈ సదస్సును నవంబరు 3న ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు, దేశ విదేశీ ప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ వెల్లడించింది.













