రాహుల్ మీ పెళ్లి అప్పుడేనా?
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరు పొందిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పెళ్లెప్పుడు చేసుకుంటారని ఒకరు అడిగారు. ఆ అడిగింది కూడా మరెవరో కాదండి బాక్సర్ విజేందర్ సింగ్. రాహుల్‌గాంధీ పెళ్లిపై ఆతృతతో, మీరు ప్రధాని అయ్యాక పెళ్లి చేసుకుంటారా? అంటూ రాహుల్‌ని ప్రశ్నించారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన 112వ యాన్యువల్ సెషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్న రాహుల్‌గాంధీని విజేందర్ ఈ ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా రాహుల్ కాస్త సిగ్గుపడుతూ, ఎప్పుడు జరగాలని ఉంటే, అప్పుడే జరుగుతుందని, తాను మాత్రం విధిని నమ్ముతానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలుసార్లు రాహుల్‌గాంధీకి తన పెళ్లి విషయంలో పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.













