సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం …
కోవిడ్-19 మహమ్మారి రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వర్చువల్ కోర్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను వాదించవచ్చునని ఆయన తెలిపారు. కోర్టులు అనారోగ్యాన్ని వ్యాప్తిచేసే ప్రదేశాలుగా ఉండరాదన్నదే మా ఉద్దేశ్యం అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇప్పటికే 143 దేశాలను చుట్టేసిన కరోనా వైరస్ కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోర్టు రూముల్లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే లాయర్లు, వ్య్యాకారులు, పాత్రికేయులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు బయట ధర్మల్ స్క్రీనింగ్ సైతం ఏర్పాటు చేయడంతో ప్రవేశ ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలైన్లు కనిపించాయి.













