స్నేహబంధం : కోహ్లీ చొక్కా వేలం వేసిన పాక్ క్రికెటర్
టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ జెర్సీని.. పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది వేలం నిర్వహించారు. SA ఫౌండేషన్ పేరుతో అఫ్రిది ఓ స్వచ్చంద సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం (జులై30) లండన్‌లో అఫ్రిది ఓ ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేసి తన దగ్గర ఉన్న క్రికెట్ వస్తువులను వేలం నిర్వహించాడు. ఇందులో కోహ్లీ జెర్సీ రూ 4300 యూరోలకు (రూ 3,25,740) అమ్ముడుపోయింది. దీంతో పాటు తన దగ్గర ఉన్న పలువురి ఆటగాళ్ల జెర్సీలను కూడా వేలం నిర్వహించాడు. ఇందులో వచ్చిన నగదును తన పౌండేషన్‌కు ఇచ్చి దాని ద్వారా చిన్నారుల విద్యకోసం ఉపయోగించనున్నాడు.
2016 లో భారత్‌లో నిర్వహించిన టీ 20 ప్రపంచకప్ టోర్నమెంట్ సమయంలో కోహ్లీ తన జెర్సీని అఫ్రిదికి అందించాడు. దీనిపై భారత ఆటగాళ్లు అంతా సంతకాలు చేశారు. లండన్‌లో అఫ్రిది నిర్వహించిన వేలంపాటకు క్రికెటర్లు అమీర్‌తోపాటు ఇమాద్ వసీం హాజరయ్యారు.













