ఉపరాష్ట్రపతి నివాసంలో సంక్రాంతి సంబరాలు
ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో సంక్రాంతి సంబరం ఆదివారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి మిలాన్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్, అశోక్‌గజపతి రాజు, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, విజయ్ గోయెల్, జితేంద్ర సింగ్, జయంత్ సిన్హాతో పాటు ఎంపీలు కె.కేశవరావు, తోట నర్సింహం, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకన్నాయి. తెలుగుభాషా సంస్కృతి ఉట్టి పడేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రధానితో సహా ఆహుతులు మంత్రముగ్ధులయ్యారు. అనంతరం కళాకారులను ప్రధానమంత్రి మోడీ అభినందించారు. అతిథులు సంక్రాంతి రుచులు చవిచూశారు.













