భారత్ లో పెట్టుబడులు పెట్టండి
భారత్లో పెట్టుబడులు పెట్టాలని రోమేనియా వాణిజ్యవేత్తలను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆహ్వానించారు. రొమేనియా పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు అక్కడి వాణిజ్యవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రొమేనియాలో ఆయుర్వేదంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు అక్కడ ఆయుష్ సమాచార విభాగాన్ని ప్రారంభించారు. ఆయుర్వేదంపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం దక్కాలన్న ఆకాంక్షకు రొమేనియా అధ్యక్షుడు క్లాస్ వెర్నర్ లోహానిస్, రొమేనియా ప్రధాని వయోరికా డాన్షిలా తమ మద్దతను పునరుద్ఘాటించినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.













