తమిళనాడులో మరో కొత్త పార్టీ
తమిళనాడులో మరో కొత్త పార్టీ అవతరించింది. అన్నా డీఎంకే సీనియర్ నాయకుడు టీటీవీ దినకరన్ ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. మదురైలో జరిగిన సభలో ఈ మేరకు ప్రకటించారు. ఎంజీ రామచందన్ర్, జయలలిత, శశికళ ఫోటోలకు పార్టీ బ్యానర్‌పై చోటు కల్పించారు. దివంగత జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో ఇటీవలే దినకరన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తన పార్టీలో అమ్మ పేరు చేర్చడం ద్వారా ఆయన వ్యూహాత్మకంగా అడుగు వేశారు. కొత్త పార్టీ, జెండాతో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ తాము విజయం సాధిస్తామని దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. రెండు ఆకుల గుర్తు సాధించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. అప్పటి వరకు కుక్కర్ గురుపైనే పోటీ చేస్తామని దినకరన్ ప్రకటించారు.













