విమాన ప్రయాణికులకు మరో శుభవార్త
విమానంలో వాయిస్ కాల్స్, డేటా వినియోగానికి సంబంధించి మరో ముందడుగు పడింది. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదనలకు అత్యున్నత నిర్ణయాక మండలి టెలికాం కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఈ ఆ శాఖ కార్యదర్శి అరుణా సుందర రాజన్ మీడియాతో మాట్లాడారు. ట్రాయ్ చేసిన అన్ని ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి రాబోయే మూడు నెలల్లో సిద్దం చేయనున్నాం అని తెలిపారు. దేశంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మొబైల్ ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునేందుకు గాను ట్రాయ్ ఈ ప్రతిపాదనలు చేసింది. దీని ద్వారా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కాల్స్, డేటాను వినియోగించుకునే వెసులుబాటు ప్రయాణికులకు లభించనుంది.













