టీఆర్ఎస్ నాయకులకు వైఎస్ షర్మిల వార్నింగ్…ఇలాంటి పనులు చేస్తే
టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు వైఎస్ షర్మిల తీవ్ర హెచ్చరికలు చేశారు. వైఎస్ఆర్ విగ్రహాలు, ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తే ఊరుకునేదిలేదన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఊపిరి ఉన్నంతవరకు తెలంగాణ గడ్డను వదిలేదిలేదని ఆమె స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నందుకే తనపై తన పార్టీపై టీఆర్ఎస్ దాడులకు దిగుతోందని ఆరోపించారు. వైఎస్ఆర్ అభిమానులు, ఆయన పథకాల వల్ల లబ్దిపొందినవారు కోట్లలో ఉన్నారని, ఇలాంటి పనులు చేస్తే సహించరని, రాళ్లు, చెప్పులతో కొట్టే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు. ఇలాంటివాటిని తాను అసలు భయపడనని అన్నారు. ఒక్కసారి దిగిన తర్వాత రాజశేఖర్ బిడ్డ (షర్మిల) వెనుకడుగువేసే ప్రసక్తే లేదని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై మాట్లాడుతున్న ఏకైక వ్యక్తిని తానేనని స్పష్టం చేశారు.













