పాలిటిక్స్ అంటేనే.. అప్ అండ్ డౌన్
ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చని, అదే విషయం తాను చెప్పానని వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన బతుకు ఇక్కడే ముడిపడి ఉందన్నారు. వైఎస్ఆర్ని ప్రేమించిన ఈ ప్రజలకు సేవ చేయడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసమే ఇక్కడ పార్టీ పెట్టానని అన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని జోస్యం చెప్పారు. అధికారంలో ఉంటాను అనుకోవడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. అధికారంలో లేనివారు, అధికారంలోకి రారనుకోకూడదని అన్నారు. పాలిటిక్స్ అంటేనే అప్ అండ్ డౌన్ ఉంటాయని అన్నారు.













