వైభవంగా నృసింహ జయంత్యుత్సవం

యాదాద్రిలో వివిధ ఆరాధన పర్వాలతో నారసింహుని జయంత్యుత్సవాలు రెండోరోజుకు చేరాయి. ఉదయం ఉగ్ర నరసింహుడిని కాళీయ మర్ధనుడి అలంకరణతో తీర్చిదిద్ది తిరువీధుల్లో ఊరేగించారు. లక్ష పుష్పాలతో ప్రత్యేక అర్చన నిర్వహించారు. ఆలయ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రతువుల్లో ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. పాతగుట్టలో కూడా వేడుకలు జరిగాయి. నృసింహ దీక్షా భక్తులు తమ దీక్షను జయంతి వేడుకతో విరమించారు.