హైదరాబాద్ లో వైట్ ఫంగస్ కేసు

కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకుతున్న జనాలు పెరిగిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‍లో వైట్ ఫంగస్ కేసు కూడా వెలుగు చూసింది. హైదరాబాద్‍లోని యశోదా ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్‍తో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్‍కు వైట్ ఫంగస్ కూడా సోకినట్లు తెలుస్తోంది. పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో వైట్ ఫంగస్ బాధితులు కూడా ఉన్నట్లు సమాచారం. కరోనా చికిత్స సమయంలో అధికంగా స్టిరాయిడ్లు వాడడం మూలంగానే ఒకేసారి బ్లాక్, వైట్ ఫంగస్‍లు దాడి చేస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.