అమెరికన్ పుట్‌బాల్ ను ప్రోత్సహిస్తాం
దేశంలో అమెరికన్ పుట్‌బాల్‌కు రాబోయే కాలంలో ఆదరణ పెరుగుతుందని తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అమెరికన్ పుట్‌బాల్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన బండా రోణిత్ను ఆయన అభినందించారు. నగరంలోని రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో రోణిత్ను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డ రోణిత్.. అమెరికన్ పుట్‌బాల్‌లో భారత జట్టు కెప్టెన్ స్థాయికి ఎదగడం ఎంతో అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ప్రతిభ గల క్రీడాకారులను మరి కొంత మందిని గుర్తించి అమెరికన్ పుట్ బాల్‌ను ప్రోత్సహిస్తామన్నారు. అనంతరం క్లచ్ థింకింగ్ బ్రాండ్ టీ షర్ట్‌ను కూడా మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్ రాజు, సాంస్క•తిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్‌కుమార్ మక్తాల తదితరులు పాల్గొన్నారు.













