వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో.. వరంగల్ పోలీసులకు

కరోనా సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించడంతో పాటు కరోనా నియంత్రణ విషయంలో చేపట్టిన చర్యలపై వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డస్ లో బెస్ట్ పోలీసింగ్, పబ్లిక్ హెల్త్ సర్వీస్ కేటగిరిలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డస్ హెడ్ ఆఫ్ యూరప్, విల్బెమ్ బెజ్జర్ పేరుతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ రికార్డులకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషికి త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డస్ లండన్ ప్రతినిధులు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ పత్రం ప్రదానం చేయనున్నారు.