తుకారానికి వికాస తరంగిణి ఆర్థిక సాయం
పర్వతశిఖరాలను తపస్విలా అధిరోహిస్తున్న తెలంగాణ మేలిమి బంగారం తుకారంనాయక్ సంకల్పాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని చినజీయర్‌స్వామి శిష్యులు శ్రీత్రిదండి అహోబిలం రామానుజజీయరుస్వామి పేర్కొన్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తుకారం సాహసయాత్రలో భాగంగా 2020 జనవరి 5న దక్షిణ అమెరికాలో మౌంట్ ఆకాన్గువాను అధిరోహించే యాత్రకు ఆశీస్సులు అందిస్తూ, రూ.6 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీయరు స్వామి యాత్ర విశేషాలను తెలిపారు. జవనరి 5న యాత్ర ప్రారంభించి, 26న గణతంత్ర దినోత్సవంనాడు శిఖరంపై తివర్ణపతాకాన్ని ఎగురవేస్తారని చెప్పారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రునాయక్తో కలిసి యాత్ర విశేషాల కర పత్రాలను ఆవిష్కరించారు.













