రాములమ్మ తమిళనాడుకు వెళ్లదట!
తాను తమిళనాడుకు వెళ్ళిపోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి సృష్టం చేశారు. అనారోగ్య కారణాల వల్ల తాను విశ్రాంతి తీసుకున్నట్లు ఆమె తెలిపారు. తన రాజకీయ జీవితమంతా తెలంగాణతోనే ముడిపడి ఉందని అన్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో తనకు మంచి సంబంధాలు ఉండేవని, ఆమెకు తానంటే ఎంతో ఇష్టమని తెలిపారు. జయలలితపై ఉన్న అభిమానంతోనే అన్నాడిఎంకెకు తాను మద్దతు తెలిపానని ఆమె పేర్కొన్నారు. తాను తమిళనాడుకు వెళ్ళిపోతున్నట్టు వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆమె తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.













