రాములమ్మ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయం పార్టీ నేతలనే
రాష్ట్ర నాయకత్వం తనను నిశ్శబ్దంలో ఉంచిందని మాజీ ఎంపీ, బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగాలని మీడియా ప్రతినిధులకు ఆమె సూచించారు. నేను అసంతృప్తిగా ఉన్నానో లేదా పార్టీ నేతల వద్ద సృష్టత తీసుకోండి. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మాట్లాడదామనుకున్నా. లక్ష్మణ్ వచ్చి మాట్లాడారు. వెళ్లిపోయారు. నాకేమీ అర్థం కాలేదు. నా సేవలను ఎలా ఉపయోగించుంటారో బండి సంజయ్, లక్ష్మణ్‌కే తెలియాలి.
పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలం. ఇవ్వకుండా చేయమంటే ఏం చేయగలం? అని ప్రశ్నించారు. నా పాత్ర ఎప్పుడూ టాప్ పాత్రే. రాములమ్మ ఎప్పుడూ రాములమ్మ పాత్రే. ఉద్యమాకారిణిగా అందరి హృదయాల్లో ఉన్నాను. పార్లమెంట్లో కొట్లాడిన మనిషిని. నా పాత్ర ఎప్పుడూ బాగానే ఉంటుంది. పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్లను పాతరేస్తే బెటర్‌గా ఉంటుంది అని అన్నారు.













