తెలంగాణ ఉద్యోగి వేముల నితిన్ అరుదైన రికార్డు…. అర్జెంటీనాలో
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి వేముల నితిన్ ఆరుదైన రికార్డు సృష్టించాడు. అర్జెంటీనాలో పర్వతారోహణ చేసి భారత పతాకం, టీఎన్జీవో పతకాన్ని ఎగురవేశాడు. ఐ అండ్ పీఆర్ విభాగంలోని డీపీఆర్ఓలో నితిన్ సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. సోమవారం అర్జెంటీనాలోని పర్వతాన్ని అదిధిరోహిచి భారత్ సత్తా చాటాడు. ఈ సందర్భంగా నితిన్‌కు సహకరించిన డాక్టర్ ముజీబ్ హుస్సేని మీడియాతో మాట్లాడుతూ టీఎన్జీవో గౌరవాన్ని నితిన్ పెంచారని, అందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు దేశానికి వన్నె తెచ్చే కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.













