తెలంగాణలో పర్యాటకాభివృద్ధికి కృషి
తెలంగాణ పర్యాటక శాఖ నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన క్రూజ్ టూర్ ప్యాకేజీ ని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు బేగంపేటలోని పర్యాటక భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన రాష్ట్రంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో వారసత్వ , చారిత్రక ప్రదేశాలతో పాటు ఎన్నో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటక రంగం పైనే ఆధారపడి అభివృద్ధి సాధిస్తుందన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు తగిన సౌకర్యాలు కల్పించి పర్యాటకులను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు రూపొందించామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు కు కు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అతి తక్కువ సమయంలో నిర్మించి సుమారు 65 లక్షల ఎకరాలకు నీరు అందించే బహుళార్ధక సాధక ప్రాజెక్టు కు తగిన ప్రచారం కల్పించి పర్యాటకులను ఆకర్షించే విధంగా కాలేశ్వరం టూర్ ప్యాకేజీ నీ ఇటీవల ప్రారంభించాము. కాలేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు రూపొందించిన టూరిజం ప్యాకేజీ కి పర్యాటకుల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అదే స్ఫూర్తితో గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి సూచనల మేరకు హైదరాబాద్ మహానగరం నుండి సుమారు 2 గంటల సమయం లోపల చేరుకునే పర్యాటక ప్రాంతాలలో మౌళిక వసతుల కల్పనకు సరైన చర్యలు చేపట్టాలని కోరారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి శ్రీశైలం ప్రాజెక్టు వరకు క్రూజ్ ప్యాకేజీ టూర్ ను తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. అంతేకాకుండా సోమశిల నుండి శ్రీశైలం వరకు టూర్ ప్యాకేజీని రూపొందించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ . వీటితోపాటు హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉన్న వివిధ కేంద్రాల్లో ఎకో టూరిజం పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలోని మయూరి ఎకో పార్క్ అభివృద్ధి చేశామన్నారు.
గోడపత్రిక ఆవిష్కరణ తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్. భూపతి రెడ్డి, పర్యాటక శాఖ కమిషనర్. శ్రీమతి సునిత భగవత్, పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావు, మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఏ జి ఎం లు వెంకటయ్య, పురంధర్ లతోపాటు పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.













