విషమంగానే ఖమ్మం విద్యార్థి ఆరోగ్యం
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లా విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వాల్పరైసో యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వరుణ్‌రాజ్ పబ్లిక్ జిమ్ నుంచి తిరిగొస్తుండగా జోర్డాన్ ఆండ్రేడ్ అనే వ్యక్తి కత్తితో కణతలో పొడిచిన విషయం విదితమే. దాడికి గల కారణాలను పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. లూథరన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్ రాజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు. అతని లైఫ్‌సపోర్టుపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా వరుణ్‌రాజ్ చికిత్స, అతని తల్లిదండ్రుల అమెరికా ప్రయాణ ఖర్చుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) గోఫండ్లో విరాళాల సేకరణ ప్రారంభించింది. బుధవారం రాత్రి వరకు 38 వేల డాలర్లు సమకూరాయి.













