10 రోజుల్లోనే కరోనా మందు
కరోనా వైరస్ ను అరికట్టే వాక్సిన్ ను తయారు చేసే దిశగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్సీయూ) ఓ అడుగు ముందుకేసింది. వర్శిటీలో బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న సీమా మిశ్రా, వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని ఆమె కనిపెట్టారు. దీనికి ఆమె ‘టీ-సెల్ ఎపిటోప్స్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని వర్శిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయోగశాలలో ఈ వాక్సిన్, వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత నోవల్ కరోనా వైరస్-2 (2019-ఎన్ సీఓవీ) ప్రోటీన్లపై పని చేసిందని పేర్కొంది. వైరస్ సోకిన వ్యక్తి శరీరంలో చెడిపోయిన కణాలను అంతం చేయడంలో తాము సృష్టించిన ఈ ఎపిటోప్స్ సమర్ధవంతంగా పని చేశాయని, ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్న ఈ ఎపిటోప్, మానవ శరీరంలో ఆరోగ్యవంతంగా ఉన్న కణాలకు ఎటువంటి హాని చేయవని ఈ సందర్భంగా సీమా మిశ్రా వెల్లడించారు. పూర్తిస్థాయిలో పరిశోధన జరిగి, తమ ప్రయత్నం సఫలమైతే, పూర్తి జనాభాకు ఒకేసారి వాక్సిన్ ను అందించడం ద్వారా కరోనా వైరస్ ను రూపుమాపవచ్చని అన్నారు.













