సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యం
సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తుందని ఉద్ఘాటించారు. 1.25 బిలియన్ భారత ప్రజలకు డిజిటల్ గుర్తింపు కార్డులున్నాయన్నారు. 60 లక్షల మంది పౌరులను డిజిటల్ అక్షరాస్యులను చేయడమే లక్ష్యమని సృష్టం చేశారు. కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు, కానీ అలా జరగలేదన్నారు. నూతన సాంకేతికత వల్ల సవాళ్లతో పాటు, ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. రోబోల ప్రవేశం నూతన సాంకేతికతలో గొప్ప మార్పని పేర్కొన్నారు. భారతీయులు ఎప్పటికీ టెక్నాలజీని ఆహ్వానిస్తున్నారని వెల్లడించారు. ఆధార్ నంబర్‌ను తీసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారని గుర్తు చేశారు.













