Bandi Sanjay: నెలరోజుల్లోగా నిధులు విడుదల చేయాలి …లేకుంటే
గ్రామ పంచాయతీలకు నెలరోజుల్లోగా నిధులు విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. కరీంనగర్లో(Karimnagar) బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ రెండేళ్లుగా రాష్ట్రంలోని పంచాయతీలకు నిధులు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. పంచాయితీలకు ఇచ్చిన నిధులన్నీ కేంద్రానివే అని స్పష్టం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ (Election code) రాకముందే, నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన సూచించారు.






