లండన్ లో హైదరాబాద్ యువతి హత్య
లండన్‌లో హైదరాబాద్‌కు చెందిన యువతి హత్యకు గురైంది. తుర్కయాంజల్‌లోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన తేజస్విని రెడ్డి (27) పై బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో దాడి చేసి చంపేశాడు. ఎంఎస్ చేసేందుకు లండన్ వెళ్లిన తేజస్విని బ్రెజిల్ యువకుడు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో తేజస్వినితో పాటు ఆమె స్నేహితురాలిపై నిందితుడు దాడి చేశాడు. ఈ ఘటనలో తేజస్విని చనిపోగా స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు నెలల క్రితమే తేజస్విని ఎంఎస్ పూర్తి చేశారు. త్వరలో ఆమె స్వదేశానికి రావాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తేజస్విని మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి రప్పించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.













