తెలంగాణలో గ్రూప్-2, 3 పరీక్షల వాయిదా.. త్వరలో

తెలంగాణలో గ్రూప్-2, 3 పరీక్షల వాయిదాకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎంపీ మల్లు రవి తెలిపారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలో తేదీలు ప్రకటిస్తుందని తెలిపారు. డిసెంబరులో గ్రూప్-2 నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించిందని చర్చల్లో పాల్గొన్న అభ్యర్థులు వెల్లడించారు. గ్రూప్-2 పోస్టుల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. గ్రూప్-2 పరీక్షల అంశంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో అభ్యర్థులతో చర్చించారు. అభ్యర్థులతో చర్చల అనంతంర ఆయన టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. డిసెంబరులో గ్రూప్-2 పరీక్షల నిర్వహణ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఓవర్ ల్యాపింగ్ లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఉటుంది. శిక్షణ కోసం విషయ నిపుణులను తీసుకువస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తారు అని భట్టి విక్రమార్క తెలిపారు.