ఆ పరిస్థితి తెలంగాణలో రావొద్దు అంటే.. ప్రతీ ఒక్కరూ
కరోనా అదపులోనే ఉన్నా జాగ్రత్తలు పాటించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాస్కు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ఇతర రాష్ట్రాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, తెలంగాణలో ఆ పరిస్థితి రావొద్దు అంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
అర్హులైన ప్రతీ ఒక్కరూ బుస్టర్ డోస్ వ్యాక్సిన్, 12 ఏళ్లు పైబడిన పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు. ఆరువారాలుగా కరోనా వైరస్ అదుపులో ఉంది. రోజు 20 నుంచి 25 మధ్య కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఫోర్త్ వేవ్ రాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజల సహకారం అవసరం ఉంటుందన్నారు. గుంపులు, సమూహల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. రాష్ట్రంలో కరోనా కంట్రోల్లో ఉండటానికి కారణం వ్యాక్సినేషన్ ప్రక్రియనే అని స్పష్టం చేశారు.













