ముస్లింలకు సీఎం రేవంత్ ఇఫ్తార్ విందు

రంజాన్ దీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ముస్లీంలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ నెల 15న రంజాన్ మొదటి శుక్రవారం కావడంతో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రతి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇవ్వనున్నట్టు రేవంత్ ప్రకటించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో కఠిన ఉపవాసం చేస్తున్న ముస్లీంలందరూ పాల్గొన్నాలని ఆయన కోరారు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.