రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు రావడం చాలా ఆనందం : గవర్నర్ తమిళిసై
రైల్వేను అభివృద్ధి చేస్తే, అది ప్రజల ఉన్నతికి దోహదపడుతుందని తెలంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బేగంపేట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిచారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లను రూ.230 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లు విమానాల మాదిరిగా దూసుకుపోతున్నాయని అన్నారు. మన రాష్ట్రానికి పలు వందే భారత్ ఎక్స్ప్రెస్లు వచ్చాయని, భవిష్యత్లో మరిన్ని వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటం శుభపరిణామం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.













