రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం… మరో 10 రోజుల పాటు
                                    దేశంలో కరోనా మహమ్మారి ఉదృతంగా వ్యాపిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షల అమలును ఈ నెల 20 వరకు ప్రభుత్వం పొడిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, జనం గుమిగూడే అన్ని కార్యక్రమాలపై ఈ నెల 20 వరకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొవిడ్ కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన జిఒ నెం.1ని జారీ చేసింది. తాజాగా ఆ నిబంధన అమలును మరో 10 రోజులుపాటు పొడిగించారు.







