మేము తలుచుకుంటే మీ పీఠం కదిలిస్తాం
వరి ధాన్యం కొనాల్సింది కేంద్ర ప్రభుత్వం కాదా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ట్రైలర్ మాత్రమే బీజేపికి ఇక సినిమా చూపిస్తామని హెచ్చరించారు. మేము తలుచుకుంటే మీ పీఠం కదిలిస్తాం, మేము బరితెగిస్తే మీరు ఉంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగం తలుచుకుంటే బీజేపీ ప్రభుత్వం కూలుతుందని అన్నారు. బీజేపీ నేతలు ధర్నా చేయడానికి కనీసం జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. ధర్నాచౌక్‌ను తాము ఎత్తి వేయలేదని స్పష్టం చేశారు. ధర్నా చౌక్ వల్ల ఇబ్బంది అవుతుందని స్థానికులే కోరారని తెలిపారు.













